హైదరాబాద్, వెలుగు : తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని, కొత్త స్టేడియాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటును అందించాలని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ కోరారు.
శనివారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో సైకియా, బోర్డు సీఈఓ హేమంగ్ అమిన్‌తో సమావేశమయ్యారు. తమ విజ్ఞప్తి మేరకు హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జిల్లాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు బోర్డు నుంచి 50 శాతం నిధులు అందిస్తామని సైకియా భరోసా ఇచ్చారని జగన్ తెలిపారు.